Friday, December 26, 2025
[t4b-ticker]

16 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.:కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన ఆర్యవైశ్యులు.:ఆర్యవైశ్యులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం.:దేశంలో అత్యధికంగా అప్పులు చేసింది కేసీఆర్:నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

కోదాడ,నవంబర్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దేశంలో అత్యధికంగా అప్పులు చేసి,రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకు తిన్నదని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాకముందు సగటు మనిషి పై 20,000 ఉన్న అప్పు సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలను తాకట్టుపెట్టి ప్రతి మనిషి పై లక్ష రూపాయల వరకు అప్పు చేశారన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని వాసవి భవన్లో తెలుగుదేశం పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంటి. ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు,మేడిగడ్డ బ్యారేజీలు కళ్ళ ముందే కూలిపోతుంటే సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు.

కమిషన్ల కక్కుర్తితో నాసిరకంగా ప్రాజెక్టు పనులు నిర్మించడంతో నిర్మించిన మూడు సంవత్సరాలకే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు.కోదాడలో గతంలో ఎన్నడు లేని విధంగా దోపిడీలు దౌర్జన్యాలు,రౌడీయిజం,పోలీసులను ఉపయోగించి సామాన్యులపై కేసులు పెట్టి వేధించడంతోపాటు గంజాయి సప్లై చేస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు.మరొక 16 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని అన్నారు.కోదాడలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకువస్తామన్నారు.ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలన్నారు.ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్యవైశ్యులకు రాజకీయాల్లో స్థానిక సంస్థలతోపాటు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.ఈ సమావేశంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి,ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మాశేట్టి అనంత రాములు,వంగవీటి రామారావు,గరినే కోటేశ్వరరావు,వెంపటి వెంకటేశ్వరరావు,ఇమ్మడి రమేష్,ఓరుగంటి కిట్టు,గరినే శ్రీధర్, పైడిమర్రి వెంకటనారాయణ,ఎర్నేని వెంకటరత్నం (బాబు) తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular