కోదాడ,నవంబర్ 19(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:బిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పద్మావతి రెడ్డి అన్నారు.చిలుకూరు మండల పరిధిలోని కొత్త కొండాపురం,పాత కొండాపురం,జానకి నగర్ తండ,దుదియా తండ,శీతల తండా గ్రామాలలో లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరో 25 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.తక్షణమే 6గ్యారెంటీ లు అమలు చేస్తామన్నారు.మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ 2500అందిస్తామని,అదేవిధంగా రూ 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని,ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా రైతులకు,కౌలు రైతులకు ఎకరానికి రూ 15000, వ్యవసాయ కూలీలకు రూ 12000, వరి పంటకు క్వింటాలుకు రూ 500 బోనస్ ఇస్తామన్నారు.గృహ జ్యోతి ద్వారా ప్రతి కుటుంబానికి 200యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.ఇళ్లులేని వారికి ఇంటి స్థలం మరియు రూ 5లక్షలు, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం ఇస్తామన్నారు.యువ వికాసం ద్వారా విద్యార్థులకు రూ 5లక్షల విద్యా భరోసా కార్డు,ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ మంజూరు చేస్తామన్నారు.చేయూత ద్వారా రూ 4000నెల వారి పెన్షన్,10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా కల్పిస్తామన్నారు.ప్రచార కార్యక్రమంలో వందలాది మంది నాయకులు,కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి గ్యారెంటీ కార్డులను పంపిణీ చేశారన్నారు.అనంతరం స్థానిక దేవాలయాల్లో పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు,సర్పంచులు,ఎంపీటీసీలు,మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు. పాల్గొన్నారు.
ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాం – పద్మావతి రెడ్డి
RELATED ARTICLES



