కోదాడ,డిసెంబర్ 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం మధ్యాహ్నం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ స్థానిక ఆర్టీసీ బస్ స్టాన్డ్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని విద్యార్థులు,యువతులు,మహిళలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పల్లెవెలుగు,ఎక్స్ ప్రెస్ బస్సులలో ఏ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఎలాంటి చార్జి చెల్లించాల్సిన అవసరంలేదని అన్నారు.

అనంతరం కాంగ్రెస్ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి,వంగవీటి రామారావులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అధికారంలోకి వచ్చిన రెండవరోజే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు.ఇదే విధంగా మిగిలిన గ్యారంటీలను కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎమ్ శ్రీ హర్ష,కాంగ్రెస్ కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు , షాబుద్దీన్,కొల్లా కోటిరెడ్డి,గంధం యాదగిరి,నిరంజన్ రెడ్డి,సామినేని ప్రమీలా,బషీర్,పారా సీతయ్య,కొండల్ రెడ్డి,ఆర్టీసీ సిబ్బంది,మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు .



