కోదాడ,డిసెంబర్ 10(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఆదివారం కోదాడ విచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ ఆధ్వర్యంలో వికలాంగులు శాలువా,బొకేతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా షేక్ రఫీ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే పాలనలో అభివృద్ధికి నోచుకోని కోదాడను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అక్క పద్మక్కను అసెంబ్లీకి పంపిన కోదాడ ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు.అక్క అందరితో ఆప్యాయంగా ఉంటూ మన మధ్య ఉంటూ మన సంక్షేమం కోసం పాటుపడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాదని అన్నారు.

ఎమ్మెల్యే పద్మావతి అక్క భవిష్యత్తులో మరిన్ని అత్యున్నతమైన పదవులు అధిరోహించాలని వికలాంగుల జాతి పక్షాన ఆకాంక్షిస్తున్నట్లు షేక్ రఫీ తెలిపారు.తనకు ఆహ్వానం పలికిన వికలాంగుల విభాగం కాంగ్రెస్ నాయకులు షేక్ రఫీని చూసిన వెంటనే ఎమ్మెల్యే వాహనాన్ని దిగి తనకు స్వాగతం పలికిన కాంగ్రెస్ వికలాంగుల విభాగం నాయకుడు షేక్ రఫీని ఇతర వికలాంగులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మీకు అండగా ఉంటా అధైర్య పడొద్దు అంటూ భరోసా ఇవ్వడంతో వికలాంగుల ఆనందానికి అవధులు లేకుండా పోయిందని అన్నారు.అనంతరం జరిగిన ర్యాలీలో వికలాంగులు హల్చల్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పలువురు వికలాంగులు తదితరులు పాల్గొన్నారు



