కోదాడ,డిసెంబర్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రికెట్ టోర్నమెంట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo తరపున పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ క్రికెట్ జట్టు కు ఉపాధ్యాయ వృత్తిలో మొట్టమొదటిగా వైస్ కెప్టెన్ గా ఎంపికై చరిత్ర సృష్టించిన కోదాడ వాసి షేక్ సిద్ధిఖ్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అభినందించారు. షేక్ సిద్ధిఖ్ ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలం లో ఎల్లాపురం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్నారు.తెలంగాణ జట్టు ఈ నెల 13 నుండి 23 వరకు దేశ రాజధాని ఢిల్లీ నగరం వేదికగా ఏఐసిఎస్ 2023 లో పాల్గొనబోతుంది.గతంలో ఈ జట్టులో అప్పటి ఐఏఎస్,ఐపీఎస్ ఆఫీసర్స్ ఆడినారు.సిద్దిఖ్ ఎంపికైనందుకు జిల్లా యువజన క్రీడాధికారి వెంకట్ రెడ్డి,ముస్కు శ్రీనివాస్ రెడ్డి,సిద్ధిఖ్,ఎంఈఓ సలీం షరీఫ్,చత్రు నాయక్,ఉపాద్యాయ సంఘ నాయకులు కొనతం వెంకట్ రెడ్డి,కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డా కొత్తపల్లి సురేష్, సభ్యులు దర్గయ్య ,చందా శ్రీనివాస్,నరేష్,నాయిని నాగేశ్వర్ రావు,సురేష్,జబ్బార్,ఖజా మియ,ఉస్మాన్,శ్రీను,శ్రీకాంత్,షఫీ,సురేష్,జహీర్,శ్రీను నాయక్,పాలకీడు కాంప్లెక్స్ హెచ్ఎం డి ఉపేందర్,పాఠశాల హెచ్ఎం వెంకట్ రెడ్డి,సైది రెడ్డి,మండల ఉపాద్యాయులు,క్రికెట్ అసోసియేషన్ సభ్యలు తదితరులు అభినందించారు.
రాష్ట్ర క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ గా షేక్ సిద్దిఖ్ ఎంపిక అభినందనీయం:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.
RELATED ARTICLES



