కోదాడ,డిసెంబర్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో పాస్టర్ సైమన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ కలపాల ప్రకాష్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ యొక్క సందేశాన్ని బోధించి ఏసు క్రీస్తు ప్రభువు యొక్క జననాన్ని ఆయన ఈ లోకంలో చేసిన సేవను గురించి వివరించారు.ఏసుప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం తనను తాను తగ్గించుకొని జీవించాడని పేదవారికి అనారోగ్యంతో బలహీనత బాధపడుతున్న వారికి స్వస్థతలు కలగచేసి వారిని దేవుని మార్గంలో

నడిపించి ప్రేమ సమాధానం సంతోషంతో జీవించాలని ఎదుటివారిని ప్రేమించాలని ఆయన బోధనల ద్వారా పాపంలో పడి ఉండిన వారిని నీతిమంతులుగా తీర్చాడని ఆయన కొంతమందిని సేవకులుగా ఏర్పరచుకొని వారి ద్వారా ఈ లోకమునకు దేవుని మాటలు విస్తరించేలా సేవ చేయాలని ఏసుప్రభువు ఈ లోకంలో తిరిగి వస్తాడని దానికోసం మీరు అంత సిద్ధంగా ఉండాలని ఆయన ప్రసంగించాడు.అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ జి ఆర్ అబ్రహం,కాంగ్రెస్ పార్టీ నాయకులు పంది తిరుపతయ్య,సిపిఎం పార్టీ టౌన్ అధ్యక్షుడు ముత్యాలు,పాస్టర్ మహేష్,పాస్టర్ బాలు,పీటర్,రాము,అక్షయ్,దినేష్,యారి గౌన్స్ వివిధ సంఘాల నుండి చర్చి పాస్టర్లు మరియు సంఘ విశ్వాసులు సుమారు వెయ్యి మంది పాల్గొని ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.



