కోదాడ,డిసెంబర్ 14(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మతసామరస్యానికి ఆధ్యాత్మికతకు ప్రతికలు సెమీ క్రిస్మస్ వేడుకలని రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం శెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని రోషమ్మ వీధిలో శ్రీ రామచంద్ర మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల యాజమాన్యం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతు అన్ని పండుగలు నిర్వహించుకోవడం భారతదేశ గొప్ప సంస్కృతి అన్నారు.క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.పాస్టర్ పొయిల సైమన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఫాతీమా ఖాజా మైనుద్దీన్,బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి షేక్ నయీమ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంది తిరపయ్య,నిర్వాహకులు హ్యారీ గోన్స్,సోమపొంగు వెంకటయ్య,పంది మనోజ్,షేక్ నాగులు,మహేష్,ఇంద్ర కిరణ్,పృద్వి,రాము,మాజీ వార్డు సభ్యులు సైదమ్మ,వైద్యశాల నిర్వాహకులు శెట్టి రవికుమార్,సిబ్బంది సంధ్య సత్యవతి,ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీకలు సెమీ క్రిస్మస్ వేడుకలు.:ఆధ్యాత్మికత కు సెమీ క్రిస్మస్ వేడుకలు చిహ్నాలు.
RELATED ARTICLES



