తెలంగాణ,డిసెంబర్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పల్లె వెలుగు బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం పేద మహిళలకు ఆర్థిక ఇబ్బంది తగ్గిస్తుందని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన,విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకురి లీలావతి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ సేవలను అమలు చేయడం సంతోషించదగ్గ విషయం.కానీ! ఆర్టీసీ బస్టాండ్ లలో మహిళల మూత్రశాలలో కనీసం సౌకర్యాలు అయిన జగ్గులు,వాటర్ బకెట్లు,డస్ట్ బిన్ లు, శుభ్రత లోపించి మరుగుదొడ్ల వల్ల ప్రతి మహిళలకు ఇన్ఫెక్షన్స్ రావటం వలన అనారోగ్య పాలవుతున్నారు.ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరుగుదొడ్లకు సంబంధించి ప్రత్యేకంగా మహిళా అధికరణ కేటాయించి మహిళల అనారోగ్య పాలు కాకోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నపం ఒక పోరాటం ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు.
మహిళలకు బస్టాండ్లలో కనీస వసతులు కల్పించాలి:లీలావతి
RELATED ARTICLES



