కోదాడ,డిసెంబర్ 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు కోదాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో కోదాడ పట్టణంలో గల కాశీనాదం ఫంక్షన్ హాల్ నందు జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పి శ్రీనివాసరావు అధ్వర్యంలో సైబర్ మోసాలపై కేసుల నమోదు,దర్యాప్తు అంశాలపై సమావేశం నిర్వహించారు.ప్రస్తుత సమాజంలో అభివృద్ధి చెందిన సాంకేతికత తో పాటుగా సైబర్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని డిఎస్పి తెలిపినారు.సైబర్ మోసాలు జరిగినప్పుడు పోలీస్ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడర్,ముఖ్య ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని శిక్షణ నిర్వహించడం జరిగింది.రాష్ట్ర పోలీసు సైబర్ సెక్యూరిటీ విభాగం అత్యంత ప్రతిష్టమైన ప్రణాళికను, దర్యాప్తు సాంకేతికతను అందించిందని,జిల్లా ఎస్పీ అధ్వర్యంలో జిల్లా కార్యాలయం నందు సైబర్ సెల్ నిర్వహిస్తున్నాం అని సెక్యూరిటీ డిఎస్పి శ్రీనివాస్ అన్నారు.సైబర్ మోసాల నివారణ పట్ల యువత,విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామలింగారెడ్డి, రామకృష్ణారెడ్డి,రాము,రాఘవలు,సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ రవి,డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు.
సైబర్ నేరాల దర్యాప్తులో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి:జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పి శ్రీనివాసరావు.
RELATED ARTICLES



