*గుర్తింపు కార్డు సమస్య ఉచిత ప్రయాణానికి ఆటంకం కాకూడదు*
హైదరాబాద్ (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రజా సేవకుడూ జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న విజ్ఞప్తి.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందనీ… ఆరోగ్యశ్రీ పరిమితి రు.10లక్షలకు పెంచిందనీ ..ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు వాగ్దానాలను తక్షణం అమలు చేయటం హర్షణీయం… అని పేద వర్గాల శ్రేయోభిలాషి, కమ్యూనిస్టు పార్టీ సీపీఐఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న నూతన ప్రభుత్వానికి రాసిన లేఖలో అభినందనలు తెలిపారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగువేల గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనందువల్ల గ్రామీణ నిరుపేద మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం లేదనీ… కామ్రేడ్ జే ఎస్ ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పల్లెవెలుగు, ప్యాసింజర్ బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే పరిమితం చేయడంతో దూరప్రయాణం చేసే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పరిమితంగానే అందుబాటులో ఉంటుందనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖల బాధితుల బంధువు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్మెల్ సెక్రటరీ కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి దేవాన్ష్
జెకె ఆర్ బోరన్న సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ పేర్కొన్నారు.
అందువల్ల ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికీ బస్సు సౌకర్యం కల్పించాలనీ సీపీఐ(ఎం ఎల్) కార్యదర్శి కామ్రేడ్ జే ఎస్ ఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గుర్తింపు కార్డు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గుర్తింపు కార్డు సమస్య వల్ల ఏండ్ల తరబడి ఇక్కడ పనిచేస్తున్న వలస కూలీలు, గుర్తింపు కార్డు లేని ఇతర రాష్ట్రాల పేద కుటుంబాల మహిళలకు ఆటంకం కాకుండా చూడాలని కూడా సీపీఐ(ఎం ఎల్) నాయకుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉపయోగమైనప్పటికీ, ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయటం ముఖ్యమని సీపీఐ(ఎం ఎల్) కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్
జే ఎస్ ఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖల విజ్ఞప్తి చేశారు.