కోదాడ,డిసెంబర్ 22 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి…!
ఎమ్మెల్యే మాటలను ఖాతరు చేయని మట్టి మాఫియా..?
చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
కోదాడ మండలంలో మట్టి మాఫియా యదేచ్చగా రెచ్చిపోతుంది కొండలను సైతం పిండి చేస్తూ యదేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు కోదాడ మండల పరిధిలోని దొరకుంట గ్రామ శివారులో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు
కోదాడ మండల శివారులోని భూములకు ధరల డిమాండ్ పెరగడంతో రియల్టర్లు గుట్టలను సైతం వదలడం లేదు గుట్టల్లో వెంచర్లు వేస్తూ కొండలను పిండి చేస్తున్నారు రియల్టర్లు ఆగడాలకు కొండలు కనుమరుగై పోతున్నాయి
ఆగని మట్టి మాఫియా ఆగడాలు…!

మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరి పోతున్నాయి రెవెన్యూ మైనింగ్ వైఖరితో మట్టి మాఫియా రెచ్చి పోయి ‘ దర్జా’గా టిప్పర్ లలో మట్టి ( గ్రావెల్ ) ని రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు . అది పట్టాభూమి అయినా లేక ప్రభుత్వ భూమి అయినా మట్టి మాఫియాకు ఒక్కటే . మట్టి మాఫియా “కన్ను ” పడితే అంతే సంగతులు . తెల్లారే సరికి మట్టి గుట్టలు మాయమౌతాయి . రాత్రికి రాత్రే సదరు మాఫియా జేసిబిలతో మట్టి ( గ్రావెల్ ) ని తోడించి అక్రమంగా ట్రాక్టర్లలో తరలించుకు పోతారు . ఒక్కో టిప్పర్ మట్టి ( గ్రావెల్ ) ధర 3700 నుంచి 4000 రూపాయలు మాఫియా రేటు చెబుతూ విక్రయిస్తున్నారు . దొంగతనంగా దోచుకు తెచ్చిన మట్టిని సదరు మాఫియా విక్రయాలు సాగిస్తోన్నా పట్టించుకునే అధికారులే లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు తాజాగా కోదాడ మండల పరిధిలోని దొరకుంట గ్రామ శివారులో పట్టాభూమిగా ఉన్న మట్టిగుట్ట పగలు రాత్రి అనే తేడా లేకుండా మట్టి మాఫియా జేసిబిలతో కోదాడ పట్టణంలోని వెంచర్ లకు 20 30 టిప్పర్ లతో గ్రావెలను తరలించి ‘ దండి’గా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు విన్పిస్తోన్నాయి . గ్రామంలో ప్రధాన రహదారి పై పట్టపగలే మట్టి మాఫియా దర్జాగా మట్టిని తరలిస్తూ కాసులు గడిస్తున్నారు.మట్టి మాఫియా కు స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అనే విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేక అధికార పార్టీ నాయకుల వత్తిల్లకు తలొగ్గి చర్యలు తీసుకోవడం మరచిపోతారో వేచి చూడాలి మరి..!
నిద్ర వ్యవస్థలో మైనింగ్ రెవెన్యూ అధికారులు….!
కోదాడ మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమ మట్టి రవాణా జరుగుతుంది

అక్రమ మట్టి రవాణా జరుగుతుంది అని పలు దిన పత్రికలలో కథనాలు వచ్చిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు
లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ వ్యవహారం అంతా సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతుంది అని ముడుపులు దండి గా అందాయని ఆరోపణలు ఉన్నాయి
ఎమ్మెల్యే మాటలను ఖాతరు చేయని మట్టి మాఫియా..?

కోదాడ నియోజక వర్గంలో మట్టి దళారులు సిండికేట్ గా ఏర్పడి పేద మధ్య తరగతి ప్రజలకు అధిక ధరలకు మట్టిని విక్రయిస్తున్నారు గత ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అని ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రధాన ఆష్రలుగా వాడుకుని 2023 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ నుండి భారీ మెజారిటీ తో గెలుపొందారు తాము అధికారంలోకి ఇలాంటివి ప్రోత్సహించం అని ఎన్నికల సమయంలో చెప్పారు కానీ అందుకు భిన్నంగా మట్టి మాఫియా యదేచ్చగా మట్టి విక్రయించడం తో మళ్ళీ పరిస్థితులు పాతకాలం లెక్కనే ఉన్నాయని మండల ప్రజలు అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే మాటలను కూడా ఖాతరు చేయక పోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు
అక్కడ వారే…..ఇక్కడ వీరే …..?

కోదాడ నియోజక వర్గంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా మట్టి అక్రమ రవాణా చేసిన వారే ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ పార్టీ లో చేరారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కోదాడ నియోజక వర్గంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కోదాడ లో గెలుపొందడంతో మట్టి మాఫియా మళ్ళీ కోరలు చాస్తుంది తమ వ్యాపారానికి అడ్డులేదు అన్నట్టు యదేచ్చగా మట్టిని రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇది చూసిన ప్రజలు ప్రభుత్వాలు ఎవరివి అయిన వ్యాపరస్తులదే పై చేయి అని మండల ప్రజలు అంటున్నారు
అక్రమ మట్టి రవాణా పై చర్యలు తీసుకోవాలి:
కోదాడ మండలంలోని దొరకుంట గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణా పై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి



