సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండలం భువనగిరి పార్లమెంట్ ఎంపీ టికెట్ చెవిటి వెంకన్న యాదవ్ కి కేటాయించాలి.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతుబిడ్డ, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని దశాబ్దాల కాలంగా పార్టీ నిర్మాణం కోసం, ప్రాణాలను సైతం అడ్డుపెట్టి నిరంతరం ప్రజా సమస్యల కొరకై, ప్రజల అభివృద్ధి, లక్ష్యంగా పనిచేస్తున్న బహుజన బిడ్డ చెవిటి వెంకన్న యాదవ్కి భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాను మరియు గత అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ను కాదని 12 అసెంబ్లీ స్థానాలకు గాను ఆలేరు అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది కావున పార్లమెంటు ఎలక్షన్లలో ఈ తప్పు జరగకుండా చెవిటి వెంకన్న యాదవ్ కి టికెట్ కేటాయించాలని పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెవిటి వెంకన్న ని గుర్తించి తగిన న్యాయం చేయాలని నాగారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కండే అంజయ్య పత్రిక సమావేశంలో మాట్లాడారు.వీరితో పాటు పసనూర్ గ్రామపంచాయితీ సభ్యులు మల్లేపాక సందీప్ , మల్లెపాక శ్రీను పాల్గొన్నారు.