కోదాడ,డిసెంబర్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని సిపిఐ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరవు పిలుపునిచ్చారు.భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం పట్టణంలోని స్థానిక తమ్మర,అల్వాలపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తమ్మర శాఖ అల్వాలపురం శాఖా ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఏర్పడిన నాటినుండి నిరుపేదల పక్షాన నిలబడి అనేక పోరాటాలను నిర్వహించి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని తెలిపారు.పార్టీ పునరీ కరణ వలన ప్రజలకు మేలు జరుగుతుందని ఆ దిశగా ప్రయాణం చేయాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వాం వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి పక్షాన నిలిచి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.నేటి యువత అమరవీరుల ఆశయాలను సాధించిన నాడే వారికి మనం ఇచ్చే ఘన నివాళులు అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తమ్మర శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్,అల్వాలపురం గ్రామ శాఖ కార్యదర్శి గోసు నగేష్,నాయకులు పోతురాజు సత్యనారాయ,రైతు సంఘ నాయకులు బొల్లు ప్రసాద్,గొట్టేముక్కల కోటి నారాయణ,కొండ కోటేశ్వరరావు,నిడిగొండ రామకృష్ణ,మాతంగి గాంధీ,గోసు దిబ్బయ్య,పసుపులేటి గోవిందరావు,గడ్డం బిక్షం,ఉదర గోవర్ధన్,కాటమరాజు,రమేష్,షేక్ బాబు,సుందరయ్య,రాంబాబు తదితరులు పాల్గొన్నారు
కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
RELATED ARTICLES



