సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున అందాజ 06.00 గంటల సమయంలో బీబీనగర్ మండలం జంపల్లి గ్రామం, చందు నాయక్ తండాకు చెందిన దేవసోత్ శ్రీకాంత్ తండ్రి నర్సింహ అను వ్యక్తీ అదే తండాకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న దెవసోత్ రెడ్యా ఆదేశానుసారం వారి యొక్క బొలెరో ట్రాలీ వెహికల్ తీసుకొని వర్ధమానుకోట గ్రామం వచ్చి గ్రామంలో కిరాయి ఇంటిలో నిలువ చేసినటువంటి సుమారు 33 క్వింటాల రేషన్ బియ్యంను తన బండిలో వేసుకొని తిరిగి బీబీనగర్ వైపు వెళుతుండగా వర్ధమానుకోట గ్రామ శివారులో వెళ్లేసరికి ముందస్తు సమాచారం ప్రకారం నాగారం ఎస్ఐ సైదులు గౌడ్ గారు మరియు సిబ్బంది గుండగాని ఎల్లయ్య మరియు వీరు నాయక్ తో కలిసి వెళ్లి అక్రమంగా బియ్యం రవాణా చేయుచున్న బొలెరో బండిని మరియు రేషన్ బియ్యం ను పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు.
33 క్వింటాల రేషన్ బియ్యం సీజ్ చేసిన నాగారం ఎస్ఐ సైదులు.
RELATED ARTICLES