కోదాడ,డిసెంబర్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎస్వి విద్యాసంస్థల్లో గతంలో పనిచేసిన ఆంజనేయ చారి ఎస్వి కాలేజీలో ఉద్యోగం మాని వేసిన తరువాత వారి అన్న దగ్గర పని నేర్చుకుంటూ ఉంటూ రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించినారు.ఆంజనేయ చారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శనివారం ఎస్వి విద్యాసంస్థల పనిచేసి ఆంజనేయ చారి ఒక కుటుంబ సభ్యునిగా మా అందరితో కలిసిమెలిసి ఉన్న అనుభంధాన్ని మర్చిపోలేక మానవతా దృక్పథంతో ఆంజనేయ చారీ భార్య పిల్లలు కుటుంబ సభ్యులకు యస్ వి విద్యాసంస్థల తరుపున ఎస్వి విద్యా సంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర రావు 50 000 వేల రూపాయలు ఆర్దికసహయం చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసినారు.అంతేకాకుండా వారి ఇద్దరి పిల్లలకు యస్వి విద్యాసంస్దల తరుపున ప్రైమరీనుండి డిగ్రీవరకు ఫ్రీ చదువులు చదివిస్దానని ముత్తినేని సైదేశ్వర్ రావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రశేఖర్,అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దాతృత్వాన్ని చాటుకున్న ఎస్వీ విద్యాసంస్థల చైర్మన్ సైదేశ్వర రావు
RELATED ARTICLES



