:స్థల పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు
:ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి,కలెక్టర్ వెంకట్రావు
కోదాడ,డిసెంబర్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి,కలెక్టర్ వెంకటరావు ఆధ్వర్యంలో కోదాడ ఆర్టీవో కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్,మెడికల్,సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ హాస్పిటల్ ను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ అతి తొందరలోనే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రుని మోడల్ ఆసుపత్రిగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ఉన్న స్థలం సరిపోదని వేరే దగ్గర స్థల పరిశీలన సంబంధిత అధికారులు చేస్తుంటే పట్టణంలో నుండి హాస్పిటల్ వేరే కాడికి పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని అనేక దరఖాస్తులు ఎమ్మెల్యే దృష్టికి వచ్చినందున దానిని పరిగణలోకి తీసుకొని ఉన్న స్థలంలోనే అన్ని విభాగాలతో హాస్పటల్ నిర్మాణం చేయడానికి పరిశీలిస్తున్నామని అన్నారు.

అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంటు డాక్టర్ దశరథ మాట్లాడుతూ 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి చొరవ తీసుకున్న స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డికి హాస్పటల్ సిబ్బంది తరుపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ వెంకటేశ్వర్లు,ఆర్డీవో సూర్యనారాయణ,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్,ఎంపీడీవో విజయ్ శ్రీ,ఎమ్మార్వో సాయి గౌడ్,హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



