కోదాడ,డిసెంబర్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చీఫ్ ఇంజనీర్ సూర్యాపేట ఓవి రమేశ్‌బాబు పరిశీలించారు.
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా కొత్తగూడెం మేజర్ క్రింద 5000 ఎకరాల చివరి ఆయకట్టు అనగా గోండ్రియాల,కొత్తగూడెం,శాంతినగర్,తమ్మరబండ పాలెం,అన్నారం, మొగలాయికుంట,చిమిర్యాల,లకారం,నల్లబండ గూడెం గ్రామాలలోని భూములకు సాగునీరు అందించటం కొరకు 2005 లో మొదలుపెట్టి 2009లో ప్రారంభించబడి 2009 నుండి 2016 వరకు సాగునీరు ఇవ్వడం జరిగింది.అయితే ఈ పథకం 2016 నుంచి పనిచేయడం లేదు. కొత్తగూడెం మేజర్ కింద 5000 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందక రైతాంగం చాల ఇబ్బంది పడ్డారు.ఈ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని మరమత్తులు చెయ్యడానికి అంచనాలు తయారుచేసి పరిపాలన అనుమతులు నిమిత్తం గవర్నమెంట్ కి పంపించి పరిపాలన అనుమతులు వచ్చిన వెనువెంటనే పనులుచేపట్టి వీలైనంత త్వరలో 5000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఓవి రమేశ్‌బాబు చీఫ్ ఇంజనీర్ తెలిపారు.
ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేపట్టి రైతులకు నీరు అందిస్తాం:ఓవి రమేష్ బాబు
RELATED ARTICLES



