కోదాడ,డిసెంబర్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమైందని,ఆ దశ లో విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజి చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు.కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజి వార్షికోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం వెళ్లేందుకు ఇంటర్మీడియట్ కోర్స్ కీలకమని,ఈ దశలో విద్యార్థి చేసే కృషి,ఉన్నత స్థానాలకు ఎదగాలనే పట్టుదల వారిని జీవితంలో ఏ స్థానంలో స్థిర పడాలో నిర్ణయిస్తుందన్నారు.

కోదాడ ప్రాంతం లో విద్యార్థులకు నగరాలలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యా బోధన తో పాటు అక్కడి మాదిరిగా సౌకర్యాలు కల్పించేందుకు ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజి ను స్థాపించినట్లు తెలిపారు.మా ప్రయత్నానికి విద్యార్థులు కూడా సహకరించి,కాలేజ్ లో సౌకర్యాలను వినియోగించుకొని రానున్న పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించాలని కోరారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,వివిధ రకాల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.విద్యార్థుల నృత్యాలకు కాలేజీ ప్రాంగణం విద్యార్థుల కేరింతలతో మారం రోగింది.ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి,కరస్పాండెంట్ నాగేశ్వర రావు,ప్రిన్సిపల్ వేణుగోపాల్,పలువురు లెక్చరర్లు,సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



