కోదాడ,జనవరి 02(మనం న్యూస్):కోదాడ మండల పరిధిలోని కూచిపూడి,కూచిపూడి తండ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు పాల్గొని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని అందరు కూడా పొందాలని కోరారు.పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కృష్ణకుమారి శేషు,మండల స్పెషల్ ఆఫీసర్ దయానందరాణి,ఎంపీడీవో విజయ,మండల వ్యవసాయ అధికారి వాసు,వైస్ ఎంపీపీ రాణి బ్రహ్మయ్య,ఆర్ఐ వెంకట నగేష్,సర్పంచులు సురేష్,సైదా,పంచాయతీ కార్యదర్శులు నాగలక్ష్మి,ప్రభాకర్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి,టిఏ సతీష్,అంగన్వాడీ టీచర్స్,వార్డు మెంబర్లు పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.



