కోదాడ,జనవరి 02(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేస్తామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్ పర్సన్,నడిగూడెం జెడ్పీటీసీ బాణాల కవితా నాగరాజ్ అన్నారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో మండల పరిధిలోని వేణుగోపాలపురం గ్రామంలో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్ పర్సన్,నడిగూడెం జెడ్పీటీసీ బాణాల కవితా నాగరాజు ప్రారంభించి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే ఆరు గ్యారెంటీ పథకాల లో భాగంగా రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు.

ప్రజా పాలన ధరఖాస్తు ఫారాలు గ్రామాలలో కొంతమంది తెలియక కొనుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని దయచేసి ఎవరు కొనుక్కోవద్దని ప్రభుత్వ అధికారులు మీ దగ్గరకు వచ్చి ఉచితంగా అందజేస్తారని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ,ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి మీ దరకాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు. ఇచ్చిన అన్ని హామీలు త్వరలోనే అమలు అవుతాయి అని, లబ్దిదారులు అప్లై చేసుకోవాలని కోరారు.అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారులు ప్రజలకు గ్రామ సభలో చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి సతీష్ కుమార్,సర్పంచ్ లు గడ్డం నాగలక్ష్మి మల్లేష్,స్వరూప,ఉప సర్పంచ్ సుజాత శ్రీనివాస్,ఎంపీటీసీ గుండు శ్రీనివాస్,తాసిల్దార్ హేమామాలిని,ఇన్చార్జ్ ఎంపీ డిఓ ఇమామ్,ఆర్ఐ గోపాలకృష్ణ,ఎఓ రాజగోపాల్,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లుఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.



