కోదాడ,జనవరి 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పెండింగ్ ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి విక్రమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఖమ్మంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నో ఏళ్లగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న రెవిన్యూ ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు.
పెండింగ్ ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని:డి విక్రమ్
RELATED ARTICLES



