కోదాడ,జనవరి 06(mbmelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పోలీస్ సేవా పథకానికి ఎంపికైన కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సోమపంగు శ్రీనివాసులుని మాదిగ ఉద్యోగుల సమాఖ్య,(ఎంఈఎఫ్ )కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఎంఈఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరివేనుల లెనిన్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాదిగ హాజరై సోమపంగు శ్రీనివాసులు ఉత్తమ పోలీస్ సేవా పథకానికి ఎంపిక కావడం మనకెంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో సేవా అవార్డులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏపూరి పర్వతాలు,జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేకూరి రమేష్,అమరబోయిన వెంకటరత్నం,యలమర్తి శౌరి,నందిపాటి సైదులు,నందిగామ.ఆనంద్,అన్నె పంగు బచ్చయ్య,గంధం బుచ్చారావు,ముసుగు బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ పోలీస్ సేవ పథకానికి ఎంపికైన సోమపొంగు శ్రీనివాసులుకు ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో సన్మానం
RELATED ARTICLES



