కోదాడ,జనవరి 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడలోని కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న జువాలజీ,కెమిస్ట్రీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం నాగు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.నెట్,సెట్,పీహెచ్డీ తోపాటు టీచింగ్ అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందన్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 50% పీజీ మార్కులు,ఓసి,బీసీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉండాలన్నారు.అర్హులైన అభ్యర్థులు ఈనెల 8 నుండి 12వ తేదీ వరకు దరఖాస్తులను కళాశాలలో అందించాలని కోరారు.ఇతర వివరాలకు సెల్ నెంబర్ 9542 731 841 లో సంప్రదించి తెలుసుకోవాలన్నారు.
అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES



