సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాల వసతి గృహంలోని పై కప్పు రేకులు లేచి పోవడం జరిగింది. వాటిని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి తొందరగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా, మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.