కోదాడ,జనవరి 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సమస్యల పరిష్కార దిశగా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరిగిందని నూతన ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య అధ్యక్షతన నిర్వహించినమండల సర్వసభ్య సాధారణ సమావేశంలో జడ్పిటిసి మందలపు కృష్ణకుమారి శేషు,ఎంపీడీవో విజయ శ్రీ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు శాఖల సంబంధిత అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాలు ఎంతమందికి అందాయి వాటి వలన ఎంతమంది లబ్ది పొందుతున్నారు వాటిపై వివరణ ఇవ్వడం జరిగింది.

ఈ వివరణలకు పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదు పాఠశాలలో కనీస వసతులు అయినా బాత్రూమ్స్ మంచినీటి సౌకర్యం రూమ్స్ శుభ్రత వంటి కనీస సౌకర్యాలను పట్టించుకోవడంలేదని అన్నారు. రోజు రోజుకి ప్రభుత్వ బడులలో గణనీయంగా తగ్గిపోతున్న విద్యార్థుల శాతం విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలో చేరుటకు విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ బడులలో విద్యార్థుల శాతం పెంచాలని పలువురు ప్రజా ప్రతినిధులు తెలిపారు. మండలాలలో గ్రామాలకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్లు చిన్నగా ఉండటం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లు పోసేటప్పుడు కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లోపాలతో పోయడం వలన తక్కువ కాలంలో రోడ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. మండల పరిధిలో పంట కాలవలు కనుమరుగైపోతున్న సంబంధిత ఎన్ఎస్పి అధికారులు పట్టించుకోకపోవడం వలన వెంచర్లలో కాలువలను రైతుల పొలాలలో కాలువలను కలుపుకోవడం వలన కిందిస్థాయి రైతులకు నీరు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులు కాలువలను గుర్తించి వాటికి మరమ్మతులు చేసినట్లయితే రైతులకు నీరు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు జరగవు అని అన్నారు. మండల పరిధిలో స్మశాన వాటికల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది స్మశాన వాటిక లలో సరైన వసతులు అయినా నీరు కరెంటు ఇతర ఇతర వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ చాలా దయనీయంగా ఉన్నాయని ఒక ట్రాన్స్ఫార్మర్ కు పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా గాలికి వదిలేస్తున్నారని వాటి వలన ప్రజలకు,మూగజీవాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.ఈ సర్వసభ్య సమావేశానికి ఉద్యానవన శాఖ,ఎక్సైజ్ శాఖ,టీఎస్ ఆర్టీసీ శాఖ వారు హాజరు కాలేదు.కొన్ని శాఖలలో సంబంధిత అధికారులు సమావేశానికి హాజరు కాకుండ వారి కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను సంబంధిత శాఖ వారు స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గ్రామ సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.



