కోదాడ,జనవరి20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బండపాలెం లో స్వయం వ్యక్తముగా వేంచేసియున్న శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి వార్షిక ధనుర్మాస ప్రయుక్త అధ్యయనోత్సవాలు నేటినుండి ప్రారంభమగుచున్నవి.ది.11 జనవరి 2024,గురువారం సాయంకాలము 6 గంటలకు తొళక్కం. 12 -1- 2024 శుక్రవారం ఉదయం 6 గంటలకు తిరుప్పావై సేవాకాలం,8గంటలకు కూడారై గిన్నెల పండుగ,9గంటలకు ద్రావిడ ప్రబంధ పారాయణ సేవా కాలం మధ్యాహ్నం మహా నివేదన,తీర్థ ప్రసాద గోష్ఠి,సాయంకాలం మరల నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ సేవా కాలం ఉండును.8గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి జరుగును.13- 1-2024,శనివారం ఉదయం 6గంటలకు ప్రాతరారాధన,కఱవైగళ్,ఉదయకాలపు సేవా కాలం,బాలభోగం,దివ్య ప్రబంధ సేవాకాలం పారాయణం ఉదయం 10గంటలకు ప్రతి నెల చేయునట్టి శ్రవణ నక్షత్ర యుక్త శ్రీ వారి మాస కల్యాణము జరుపబడును.మధ్యాహ్నం 12 గంటలకు రాజ భోగం,మహానివేదన తీర్థ ప్రసాద గోష్ఠి ఉండును.సాయంకాలము 5 గంటలకు నాలాయిర దివ్య ప్రబంధం పారాయణం 8 గంటలకు శ్రీమన్ నమ్మాళ్ళువార్ల పరమపద ఉత్సవము జరుగును.తరువాత తీర్థ ప్రసాద గోష్ఠి జరుగును.14 -1- 2024 ఆదివారం ఉదయం 6 గంటలకు శాత్తుమురై,భోగి పండుగ సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరుపబడును.కావున భక్తులెల్లరు దేవాలయానికి విచ్చేసి భగవంతుని సేవలో పాల్గొని తరించగలరని.అర్చకులు,చైర్మన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు,స్థానాచార్యులు,మాసకల్యాణోత్సవ నిర్వాహకులు ముడుంబై లక్ష్మణాచార్యులు,కార్యనిర్వహణాధికారి,దేవాదాయ ధర్మాదాయ శాఖ టివి చలపతి లు తెలిపారు.
నేటినుండి అధ్యయనోత్సవాలు ప్రారంభం.
RELATED ARTICLES



