కోదాడ,జనవరి 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వాసవి క్లబ్ కోదాడ 2023 లో చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు అంతర్జాతీయ అత్యుత్తమ క్లబ్ గా ప్రకటించటం జరిగింది.ఈ ప్రతిష్టాత్మక అవార్డును గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి,ఐపీసీ చల్లా విజయశేఖర్,జిల్లా ఇంచార్జి పబ్బా గీత,రీజియన్ చైర్మన్ 2023,జగిని ప్రసాద్,జోన్ చైర్మన్ 2023,చల్లా లక్ష్మీనరసయ్య లు పూర్వ వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు ఇమ్మడి సతీష్ బాబు,కార్యదర్శి సేకు శ్రీనివాసరావు,కోశాధికారి వెంపటి ప్రసాద్ లకు అందచేశారు.

ఈ సందర్భముగా పూర్వ క్లబ్ అధ్యక్షులు ఇమ్మడి సతీష్ మాట్లాడుతూ క్లబ్ సిగలో మరొక కలికితురాయి వచ్చి చేరిందని,గత సంవత్సరం అవార్డుల పంట పండించామని,రీజియన్ నుండి మొదలుకొని అంతర్జాతీయం వరకు ఎన్నో అవార్డులు పలుకరించటం 2023 ని మరిచిపోలేని గోల్డెన్ సంవత్సరంగా మలిచామని అన్నారు.దీనిలో నాకు అన్ని విధాలుగా సహకరించిన మా కార్యదర్శి సేకు శ్రీనివాసరావు,కోశాధికారి వెంపటి ప్రసాద్,ఐపీసీ చల్లా విజయశేకర్,జిల్లా ఇంచార్జి పబ్బా గీత,కార్యవర్గ సభ్యుల కృషి సహకారం ఎంతో ఉందని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి గరిణే శ్రీధర్,ప్రస్తుత ఆర్ఈసి బండారు శ్రీనివాసరావు,ప్రస్తుత క్లబ్ అధ్యక్షులు వంగవీటి నాగరాజు,ఉపాధ్యక్షులు గుడుగుంట్ల సాయి,వెంపటి వెంకటేశ్వర్లు (సిరిపురం),వంగవీటి గురునాధం,బెలిదే అశోక్,బెలిదే భరత్,చల్లా అశోక్,వెంపటి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



