కోదాడ,జనవరి 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వివేకానంద జయంతి ని పురస్కరించుకుని బిజెపి కోదాడ అసెబ్లీ కన్వీనర్ అధ్యక్షతన వివేకానంద జయంతి వేడుకలను కోదాడ లోని పార్టీ కార్యాలయం లోఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన,సత్తుపల్లి నియోజకవర్గ ప్రభారి కనగాల వెంకటరామయ్యలు అతిధులుగా పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు మట్లడుతు భారతీయత హిందూ ధర్మం ప్రపంచంలో పరిడమిల్లాలి అంటే నేటి యువత స్వామి వివేకానంద వారిబోధనలనుపాటించాలని అన్నారు.వారిలా పనిలో ఏకాగ్రతను పాటించాలని,వారి సిద్ధాంతాలను పాటించాలని కొరినారు.ఈ కార్యక్రమంలో బిజెకేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెలివోలు చిట్టిబాబు,జిల్లా బిజెకేఎం ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అంబటి సుధాకర్ రెడ్డి,జయలక్ష్మి,స్వప్న,జ్యోతి,ఉమామహేశ్వరి,భూమా శ్రీనివాస్,కొదుమూరు విశ్వేశ్వరరావు,నాగేశ్వరరావు,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
RELATED ARTICLES



