కోదాడ,జనవరి14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా కైట్ ఫెస్టివల్ నిలిచిందని కోదాడ విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు.ఆదివారం బైపాస్ ప్లే గ్రౌండ్లో వాసవి యూత్ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ ను వారు ప్రారంభించినారు.

అనంతరం వారు మాట్లాడుతు కోదాడ ప్రాంతంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే ప్రధమమని,ఈ ఫెస్టివల్ కు పతంగులు ఎగురవేయ్యడానికి వంద మంది యువకులు రావడం,ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైస్ ఇవ్వడం అభినందనీయమన్నారు.సామాజిక సేవలో ముందుండే వాసవి యూత్ క్లబ్ ఈ ఫెస్టివల్ నిర్వహించడం కోదాడకు కొత్త శోభను తెచ్చిందన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవీటి గురుమూర్తి మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.మొట్టమొదటిగా కోదాడలో కైట్ ఫెస్టివల్ను నిర్వహించడం అభినందనీయమన్నారు వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మున్ముందు మరెన్నో కార్యక్రమాలు విరివిగా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.కైట్ ఫెస్టివల్ కు న్యాయ నిర్ణీతలుగా విశ్వజ్ఞాచారి,ఏడుకొండలు,ఉపేందర్,ప్రభాకర్ లు వ్యవహరించారు.

అనంతరం *ఎక్కువ ఎత్తు ఎక్కువ దూరం కైట్ ఎగరేసిన మాతంగి గగన్ తేజ్ కి మొదటి బహుమతి అందించారు.* గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం నిర్వహించటంతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్థానిక పిపిఆర్ మాల్ వారు అందజేసిన గిఫ్ట్ ఓచర్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఇమ్మడి అనంత చక్రవర్తి,డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర,వాసవి క్లబ్ బాధ్యులు పబ్బా గీత,గరిన శ్రీనివాసరావు,చల్లా లక్ష్మీనరసయ్య,జెగిని ప్రసాద్,అధ్యక్షులు ఇమ్మడి రమేష్,చారుగుండ్ల రాజశేఖర్,రాయపూడి వెంకటనారాయణ,పందిరి సత్యనారాయణ,బెలిదే భరత్ తదితరులు పాల్గొన్నారు.



