కోదాడ,జనవరి 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నడపబడుతున్న 204 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో( బాలురు-107,బాలికలు-97) ప్రవేశాలకు 5,6,7,8 తరగతులు,ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశం పొందుటకు నోటిఫికేషన్ విడుదలైంది.5వ తరగతిలో ప్రవేశం పొందుటకు ఫస్ట్-కమ్ -ఫస్ట్ ప్రాతిపదికన ప్రవేశాలుంటాయి.6,7,8 తరగతులకు బ్యాక్లాగ్ (మిగిలిపోయిన) సీట్ల ఖాళీలలో ప్రవేశాలు జరుగుతాయి.ఇంటర్మీడియట్ (కాలేజ్ ఆఫ్ ఎక్సెల్లెన్స్)లో ప్రవేశాలు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు.కావున కోదాడ నియోజకవర్గ విద్యార్థుల పేరెంట్స్ తప్పక సద్వినియోగం చేసుకోగలరు.ఇట్టి ఉచిత దరఖాస్తులను మెగా సంస్థ చేయనున్నట్లు మెగా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు షేక్ జాన్ పాషా,ఎండి జహీర్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.కోదాడలోని ఎస్వి జూనియర్ కళాశాల పక్కనగల కేబి జిరాక్స్ (9912420520)లో సంప్రదించవచ్చు.దరఖాస్తు దాఖలకు చివరి తేదీ
ఫిబ్రవరి 6,2024.
*దరఖాస్తు చేసుకొనుటకు కావలసినవి*:-
1) విద్యార్థి పేరు 2)పుట్టిన తేదీ
3)కులం
4)ప్రస్తుతం చదువుతున్న తరగతి& స్కూల్ వివరాలు
5)ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో
6)తల్లిదండ్రుల పేర్లు 7)ఆధార్ కార్డు నెంబర్ 8)తల్లిదండ్రుల ఫోన్ నెంబర్
మెగా ఆధ్వర్యంలో మైనార్టీ గురుకుల దరఖాస్తులకు ఉచిత ఆన్లైన్ సౌకర్యం
RELATED ARTICLES



