వరంగల్ జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) :
వరంగల్ జన్పాక ప్రాంతంలో బతుకుదెరువు కోసం వచ్చి నివసిస్తున్న గిరిజన మహిళ తేజావత్ బుజ్జి మెయిన్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఎక్స్చేంజ్ శాఖ సీఐ రమేష్ చంద్ర ఇద్దరు కానిస్టేబుల్ సీఐ వెహికల్ ప్రైవేట్ డ్రైవర్ మహేందర్ కలిసి నడిరోడ్డు మీద నానా బూతులు తిడుతూ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఎవరు మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అని పలుమార్లు విన్నవించినప్పుడు లంబడి దాన మేము ఎవరో నీకు తెలియదా మాకు 30 వేల రూపాయలు ఇస్తావా ఇయ్యవా అని రోడ్డు పక్కన కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది కొట్టి వెహికల్ వేసుకొని పోయే క్రమంలో ఒక కానిస్టేబుల్ కాలనీ గట్టిగా పట్టుకోవడంతో వాళ్ల సెల్ నెంబర్ బుజ్జి అనే బాధితురాలి సెల్లో ఫీడ్ చేసి మాకు పొద్దున ఫోన్ చేసి 30 వేల రూపాయలు పంపించాలని డిమాండ్ చేయడం జరిగింది బుజ్జి అనే మహిళ పై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసిన సీఐ రమేష్ చంద్రను అతనితో పాటు ఉన్న ముగ్గురు వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.