కోదాడ,జనవరి 24(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ లో పరిసరాలతో పాటు అన్ని వసతులు ఎలా ఉన్నాయి అని క్షేత్రస్థాయిలో తెలుసుకోనుటకు,అమలు తీరును తెలుసుకోనుటకు కాయకల్ప టీం హైదరాబాద్ బార్కస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కలీమ్,అమీర్ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రం కోదాడను బుధవారం సందర్శించినారు.

అసుపత్రిలో వివిధ విభాగాలు అయినా ఆపరేషన్ థియేటర్,ఎక్సరే,హాస్పిటల్ పరిసరాల పరిశుభ్రత,మార్చురీ గది నిర్వహణ,ల్యాబ్ పనితీరును అడిగి తెలుసుకోని పరిశీలించారు.హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథను హాస్పిటల్ యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు.అనంతరం డాక్టర్ కలీమ్ మాట్లాడుతూ కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ పరిసరాల పరిశుభ్రత ఎంతో చక్కగా ఉందని తెలిపారు.హాస్పిటల్ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే రోగుల యొక్క ఆరోగ్యం అంత తొందరగా తగ్గుతాదని ఆయన అన్నారు.హాస్పటల్ పరిసరాలలో గ్రీనరీ చక్కగా ఉందని అన్నారు.

ల్యాబ్ పనితీరు థియేటర్ వసతులు ఎక్స్ రే పనితీరు,మార్చురీ గది నిర్వహణ చాలా చక్కగా ఉన్నాయని అన్నారు.హాస్పిటల్ లో అన్ని వసతులు చక్కగా నిర్వహిస్తున హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథను అభినందించారు.ఈ కర్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ,డిసిహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు,హాస్పిటల్ సిబ్బంది డా, కే సురేష్,డా,, నరసింహ,డా,, మమత,డా,, లక్ష్మణ్,హెడ్ సిస్టర్ మంగమ్మ,ల్యాబ్ టెక్నీషియన్ స్రవంతి,యూడిసి సతీష్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



