కోదాడ,జనవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ సామాజిక ఆరోగ్య కేంద్రం లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ అన్నారు. ముందుగా హాస్పిటల్లో జాతీయ జెండా ఎగరవేసిన డాక్టర్ దశరథ. ఈ సందర్భంగా డాక్టర్ దశరథ కోదాడ నియోజకవర్గ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు రాజ్యంగ స్ఫూర్తికి అనుగుణంగా,ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని అన్నారు.రాజ్యాంగ నిర్మాతకు నివాళులుఅర్పించుకుంటూ స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరాంకితం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ కే సురేష్,డాక్టర్ నరసింహ,డాక్టర్ మమత,డాక్టర్ లక్ష్మణ్,హెడ్ సిస్టర్ మంగమ్మ,ల్యాబ్ టెక్నీషియన్ స్రవంతి,యూడిసి సతీష్,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



