గరిడేపల్లి,జనవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారత రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు రాజ్యంగ స్ఫూర్తికి అనుగుణంగా,ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని అధ్యక్షులు నందిపాటి శ్రీను అన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసిన యూత్ అధ్యక్షులు నందిపాటి శ్రీను.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని అన్నారు,నియోజకవర్గ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు,స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు,భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటు పాడాలన్నారు, స్వాతంత్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస,శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు
చిలక సైదులు,నందిపాటి రామకృష్ణ,నందిపాటి రాజేష్,పంగ జ్యోతి బాబు,రామ్ నాగేంద్రబాబు,నందిపాటి పృథ్వి,నందిపాటి మహేష్,రామ్ రాజు,రామ్ గురుస్వామి,కదురు మనోహర్,నరాల పవన్,నందిపాటి శ్రావణ్,నందిపాటి లోహిత్,గద్దల నాగరాజు,నందిపాటి మధు,రామ్ చిన్న సైదులు,షేక్ హుస్సేన్,నందిపాటి మట్టయ్య,నందిపాటి సత్తయ్య,నందిపాటి ఇస్సాకు,రామ్ సాయిలు,నెమ్మది వెంకటయ్య,లంజపల్లి రమేష్,చిలక పిచ్చయ్య,నందిపాటి మల్లయ్య,చిటికెల ప్రేమ్ కుమార్,ఇరుగు అనిల్,చిలక మనోహర్,మద్యమడుగు శ్రీను,యంపిటిసి లు,గ్రామ పెద్దలు,విద్యా వంతులు,మేధావులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు:మహానీయుల ఆశయ సాధన కృషి చేయాలి.
RELATED ARTICLES



