కోదాడ,జనవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో గల స్థానిక అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది అని,భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం అని,రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో శ్రమించి భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.

భారతదేశంలోని 130 కోట్ల మంది ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నారు అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని, ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి లోబడి జీవించాల్సిందని,రాజ్యాంగబద్ధంగా కోదాడ నియోజకవర్గం ప్రజలకు తన సేవలు అందిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి,ఆవుల రామారావు,దాసరి జయసూర్య, బరపటి కోటేశ్వరరావు,కుడుముల రాంబాబు,పంది తిరుపతయ్య,చింతలపాటి సతీష్,పోలే ఏసోబు తదితరులు పాల్గొన్నారు



