కోదాడ,జనవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశ క్షేమం కొరకు కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం రైతుల క్షేమం కొరకుప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.భారతదేశం రాజ్యాంగం అమలైన రోజుని మన జాతి జాతిపిత గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు బలిదానం చేసిన స్వతంత్ర సమరయోధులను స్మరణ తెచ్చుకున్నారు,వారిని ఆదర్శంగా తీసుకొని యువత దేశ క్షేమం కొరకు పాటుపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యురాలు వంటిపాకజానకి ఏసయ్య,పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య,రాష్ట్ర టీచర్స్ గిరిజన ఉపాధ్యక్షులు బానోతు జగ్గు నాయక్,ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సుమలత,పాస్టర్లు జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్,ప్రకాష్,ప్రభుదాస్,రాము,డేవిడ్రాజ్,గురునాథ్,సైమన్,ప్రభాకర్,రాంబాబు,మేరమ్మ,వరమ్మ,మణెమ్మ,ప్రభాకర్,భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు
RELATED ARTICLES



