కోదాడ,జనవరి 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మడి అనంత చక్రవర్తి పేర్కొన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఐఏఎస్ ప్రకాష్ రావు కాలనీలో స్వచ్ఛభారత్ మొక్కలు నాటే కార్యక్రమాలను యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందించే శక్తి వృక్ష సముదాయాలకు ఉంటుందన్నారు.ప్రస్తుత సమాజంలో నిర్మాణాలు వాహనాలు పెరగడంతో చెట్ల పెంపకం తగ్గిపోయిందన్నారు దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు.పర్యావరణానికి ముప్పు ఏర్పడితే మానవ మనుగడకు విఘాతం కలుగుతుందన్నారు మొక్కలు నాటడం సంరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ మొక్కలు నాటే కార్యక్రమాలను తరచుగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ భరత్ చంద్ర,జగిని ప్రసాద్,బెలిధే భరత్ కుమార్,గరినే కోటేశ్వరరావు,ఇరుకుల్ల చెన్నకేశవరావు,ఇమ్మడి రమేష్,గుడుగుంట్ల శ్రీనివాసరావు,కందిబండ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
RELATED ARTICLES



