కోదాడ,జనవరి 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దశరథ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ మండల స్థాయి పోటీ పరీక్షలో సత్తా చాటిన బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థి ..స్థానిక బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఎం క్లింటన్ కోదాడ మండల స్థాయి లో జరిగిన పోటీ పరీక్షలో బహుమతి ని గెలుపొందిన్నందుకు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రిన్సిపాల్ బెజ్జంకి జగన్మోహనరెడ్డి అన్నారు..విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధులుగా చేయడమే మా స్కూల్ ప్రత్యేకత అన్నారు.పట్టణంలో గత 14 సంవత్సరాలుగా పదవ తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు అందించిన సంస్థ బ్రిలియంట్ అని అన్నారు.కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ చేతుల మీదుగా విజేతకు బహుమానం అందచేయడం జరిగింది. పాఠశాల అంటే బుక్స్ లో ఉన్న పాఠాలు బోధించడం కాదు పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దడం అని వైస్ ప్రిన్సిపాల్ పి ఎస్ ఎన్ శ్రీనివాస్ అన్నారు.పాఠశాలకు ఇలాంటి పురస్కారాలు రావడం ఎంతో ఆనందంగా ఉంది,ఈ ప్రోత్సహం వాళ్ళ బంగారు భవిష్యత్తు కి పునాది కావాలని పాఠశాల ఎక్సమినేషన్ ఇంచార్జి గరిడేపల్లి రమేష్ అన్నారు .ఈ కార్యక్రమంలో అంజయ్య,నరేష్,ఉపేందర్, హసీనా తదితరులు పాల్గొన్నారు..
మెరిసిన ఆణిముత్యం …సక్సెస్ కి చిరునామా మా బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్:ప్రిన్సిపాల్ బెజ్జంకి జగన్మోహనరెడ్డి
RELATED ARTICLES



