విజయనగరం జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు);డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అత్యవసర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం కు విశేష స్పందన లభించింది. జిల్లాలో రక్తం నిల్వలు కొరత కారణంగా మరియు తలసేమియా పిల్లలు , గర్భిణి స్త్రీల కొరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్ తెలిపారు .రక్తదానం ప్రాణదానం తో సమానం అని, ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన అందరూ కూడా రక్తదానం చేయొచ్చని, తెలియజేశారు, ఈ రక్తదాన శిబిరంలో 53 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యుడు రఘు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడొచ్చు అని తెలియజేశారు, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.సేకరించిన రక్త నిల్వలు విజయ బ్లడ్ బ్యాంక్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు అశోక్, సాయి, రాయల్ క్యాబ్స్ శరత్, రాము, రఘు,విజయ్ , కళ్యాణ్, విజయ బ్యాంక్ మేనేజర్ పుణ్యమంతుల శివ తదితరులు పాల్గొన్నారు.



