కోదాడలో 26 కోట్లతో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన.
సిటీ స్కాన్, ట్రామ సెంటర్ మంజూరు.
అసుప్రతుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత.
మంత్రులు రాజ నర్సింహ, నలమాద ఉత్తమ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు.
కోదాడ,ఫిబ్రవరి 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పేదల ప్రభుత్వంలో పేద,నిరుపేద లకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందాలని ఆదిశగా వైద్యాధికారులు బాధ్యతాయుతంగా సేవాలందించాలని సూచించారు. బుధవారం స్థానిక శాసన సభ్యురాలు నలమాల ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధ్యక్షతన 14 వార్డులో పాత ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో రూ. 26 కోట్లతో చేపట్టే 100 పడకల ప్రాంతీయ వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పం అర్హులైన పేదలకు మెరుగైన వైద్యం అందాలని హైదరాబాద్ తరహాలో జిల్లాలోని సూర్యాపేట,హుజూర్ నగర్,కోదాడ లలో అందాలని అలాగే ప్రతి పీహెచ్ సిలలో మందుల కొరత ఉండకుండా చూడాలని సూచించారు.హుజూర్ నగర్,కోదాడ లలో చెరో చోట సిటీ స్కాన్,టిఫా అల్ట్రా సౌండ్ లను మంజూరు చేస్తున్నట్లు వారంలో ఏర్పాటు చేయాలని సూచించారు.తదుపరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ,హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని పేదలకు,నమ్మకం,విశ్వసం పెరగాలని వైద్యులు ఆదిశగా సేవాలందించాలని పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో రెడ్లకుంట గ్రామానికి కింద 5 వేల ఎకరాల సాగుకు రూ.47 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచామని త్వరలో లిఫ్ట్ ప్రారభించుకుంటాని మరికొన్ని లిఫ్ట్ ల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేశామని తెలిపారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు నీరు అలాగే రోడ్లు కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించామని ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు.

ఆసుపత్రిల వారీగా వసతుల కల్పనపై సమీక్షించారు.ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిష్టినా,కమిషనర్ అజయ్,డైరెక్టర్ ఆర్ వి కర్ణన్,జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్,అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక,ఏ వెంకట్ రెడ్డి,డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ కోటా చలం,ఏరియా ఆసుపత్రుల పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రెడ్డి,కరుణ్ కుమార్,హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.



