కోదాడ,ఫిబ్రవరి 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:టీఎస్పీఎస్సీ లో గత 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పారామెడికల్ లాబ్ టెక్నీషియన్ (67/2017) తుది ఫలితాలు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతి పత్రం అందించిన ల్యాబ్ టెక్నీషియన్లు. కోదాడలో 26 కోట్లతో వంద పడకల వైద్యశాల భవనం నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు బుధవారం వివిధ పత్రం అందించిన ర్యాప్ టెక్నీషియన్లు.ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్లు మాట్లాడుతూ
మేము 2017 లో టిఎస్పిఎస్సి లో జారీచేసిన లాబ్ టెక్నీషియన్ 67/2017 ఉద్యోగాల కోసం పరీక్ష రాసి దాదాపు 7 సంవత్సరాల నుండి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నాం.ఈ పారామెడికల్ ఉద్యోగాలు మా జీవిత కాలం మొత్తం లో వచ్చిన మొట్ట మొదటి నోటిఫికేషన్ దాదాపు 25 సంవత్సరాలు గా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు.ఎన్నో సంవత్సరాల ఎదురు చూపు తరువాత 2017 లో టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ అయ్యింది.2018 మే 11 న ఎగ్జామ్ నిర్వహించడం మేము అందరం ఎగ్జామ్ రాయడం జరిగింది.అప్పటి నుండి మెరిట్ లిస్ట్ పెట్టడం కొరకు,రిక్రూట్మెంట్ త్వరగా పూర్తి చేయాలని కొన్ని వందల సార్లు టిఎస్పిఎస్సి చుట్టూ తిరగగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.వెరిఫికేషన్ పూర్తి అయ్యి కూడా 6 నెలల గడచింది.ఇంకా తుది ఫలితాలు విడుల చెయ్యలేదు.కేవలం టిఎస్పిఎస్సి నిర్లక్యం వల్ల మాకు తీవ్ర అన్యాయం జరిగింది.అయ్యా మాలో చాలా మంది ఏజ్ కూడా 50 సం.ల కి దగ్గరగా వచ్చింది ఇపుడు ఉద్యోగాలు ఇచ్చిన 8 -10 సంవత్సరాలు మాత్రమే చేసే అవకాశం ఉంది మా ఈ దీన గాధ ను గుర్తించి తొందరగా మా సెలక్షన్ లిస్ట్ పెట్టించి దయతో మా యొక్క ఉద్యోగ నియామకాలు చేపట్టి మాకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ల్యాబ్ టెక్నీషియన్ల ఉద్యోగ ఫలితాలు టీఎస్పీఎస్ తక్షణమే విడుదల చేయాలి
RELATED ARTICLES



