కోదాడ,ఫిబ్రవరి 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ రోజు రానే వచ్చింది. నేడు శుభదినం రాజకీయ దురంధరుడు,బహుభాషా కోవిదుడు,రాజకీయ రంగాలలో ఘనుడు,17 భాషలలో ఆనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త,అపరమేధావి,భారత ప్రధాన మంత్రిగా దేశానికి దిశ,దశ మార్గాన్ని సూచించిన పాములపర్తి వేంకట నరసింహారావుకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కరం అయిన భారతరత్న అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల యావత్ తెలుగు – ప్రజలు హర్షాదిరేఖాలు వ్యక్త పరిచారు.స్థానిక తేజ పాఠశాలలో విద్యార్యలు వినూత్నమైన రీతిలో పిరమిడ్ ఆకారంలో ఆనందాన్ని వస్తపరిచారు.పాఠశాల డైరెక్టర్ జానకి రామయ్య మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ నాయికుడికి భారతరత్న రావడం తెలుగు ప్రజలు చేసుకున్న గొప్పవరంగం భావించి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయి యం అప్పారావు,పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమర్,ఉప ప్రధానోపాధ్యాయులు సోమనాయక్,ఇంచార్జిలు రాంమూర్తి,ఝాన్సీ,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు
భారతరత్న తెలుగువాడికి కైవసం
RELATED ARTICLES



