కోదాడ,ఫిబ్రవరి 11(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కొన్ని రోజుల క్రితం భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల అనుమానస్పద మరణాలు నిన్న సూర్యాపేటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందిన ఘటనలకు నిరసనగా కాపుగల్లు గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వేరోస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కిరణ్ స్వేరో చెరుకుపల్లి పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు విద్యార్థినుల తల్లిదండ్రులలో భయాందోళన కలిగిస్తున్నాయని ఆడపిల్లల్ని వసతి గృహాల్లో ఉంచి చదివించాలంటే భయపడుతున్నారని అన్నారు.ఇలాంటి ఘటనలు ఆడపిల్లల చదువులకు గొడ్డలి పెట్టు లాంటివని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని,మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలోబాలకృష్ణ,సాయి,గోపి,శ్రీకాంత్,పుల్లయ్య,ముఖేష్,బాబురావు,జ్యోతి,స్వాతి,శ్రీదేవి,రజిని,రాకేష్,మనోజ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
స్వేరోస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
RELATED ARTICLES



