Monday, July 7, 2025
[t4b-ticker]

భువనగిరి హాస్టల్ ని సందర్శించిన నకిరేకల్ బీఎస్పీ నియోజక వర్గం ఇంచార్జీ మేడి ప్రియదర్శిని.,

యాదాద్రి భువనగిరి జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): ఇటీవల భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్ లో భవ్య, వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ హాస్టల్ ని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని సందర్శించింది. ఆ పిల్లలిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ?, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఆరా తీసింది.అనంతరం భవ్య, వైష్ణవి తల్లితండ్రులను కలిసి వాళ్లకు ధైర్యం చెప్పింది. ఆ తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ ‘భవ్య , వైష్ణవి లు చనిపోవడం చాలా బాధాకరం. ఆ పిల్లలిద్దరి తల్లితండ్రుల బాధను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇదివరకే హాస్టల్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇద్దరు అమ్మాయిలపై దాడి చేసారని తెలిసింది. వాళ్ళు ఎవరో పోలీసులు విచారించి పట్టుకోవాలి. అంతే కాకుండా హాస్టల్ లో సెక్యూరిటీ ని బాగా పెంచాలి, గవర్నమెంట్ హాస్టల్ లో చదివే విద్యార్థులు ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల భయపడుతున్నారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టి భరోసా నింపే బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వత హాస్టల్ భవనాలను నిర్మించాలి’ అంటూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular