:ఎర్రవరం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వపరంగా కృషి చేస్తాం.
:ఎర్రవరం ఆలయంలో జెసి వెంకట్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు.
కోదాడ,ఫిబ్రవరి 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో శ్రీ దూలగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లడం ఈ ప్రాంత వాసులకు శుభసూచకమని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు.

మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తన వంతు సహకారం అందిస్తానన్నారు.చారిత్రాత్మక ఆలయాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ స్థానిక అధికారులు పాల్గొన్నారు.



