కోదాడ,ఫిబ్రవరి 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జర్నలిస్టులకు కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అన్నివేళలా అండగా ఉంటుందని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్,కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలోని షాదిఖానాలో ఎలక్ట్రానిక్ మీడియా కోదాడ నియోజకవర్గం యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్న జర్నలిస్టు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తామన్నారు.తల్లిదండ్రులు మరణిస్తే రూ. 15,000 వేలు, అలాగే బార్య పిల్లలు అనారోగ్య గురి అయితే.. వారికి రూ10000 వేలు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సినీయర్ జర్నలిస్టు రాంబాబు,ప్రెస్ క్లబ్ జిల్లా నాయకులు తంగెళ్లపల్లి లక్ష్మణ్,చెరుకుపల్లి శ్రీకాంత్,కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిడుమర్తి గాంధీ,కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు పూర్ణచంద్రరావు,ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ,కోశాధికారి చీమ చంద్రశేఖర్,ఉపాధ్యక్షులు సురేష్,సహాయ కార్యదర్శి శ్రీహరి,మహమ్మద్,వాసు,దినేష్,సునీల్,నజీర్,హరీష్,అశోక్ రెడ్డి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ లక్ష్యం:జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.
RELATED ARTICLES



