బుధవారం,ఫిబ్రవరి 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దళితులపై దాడిచేసినవారిపై హత్యాయత్నం,ఎస్సి,ఎస్టీ ఎట్రాసిటి కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి:కోదాడ నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ అన్నారు.కోదాడ పట్టణ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ పాస్టర్లు యేసయ్య జిఅర్ అబ్రహం మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో పెద్ద సంఖ్యలో మతోన్మాదలు గ్రామంలో ఉన్నటువంటి మెథడిస్టు చర్చ్ పై గత రాత్రి దాడి చేసి చర్చిని ధ్వంసం చేస్తూ,అక్కడితో ఆగకుండా చర్చ్ లోపల క్రైస్తవులు తలుపులు వేసుకొని భయంతో దాసుకున్న వారిని కూడా ఓదలకుండా తలుపులు పగలగొట్టి వారిపై, అలాగే అక్కడున్నటువంటి దళితులపైన భూతులు తిడుతూ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఇనుప రాడ్లతో,కర్రలతో,రాళ్ళ తో,ఇటుకలతో దాడి చేసి దాదాపు 25 నుండి 30 మంది కీ పైగా కాళ్ళు చేతులు,తలలు పగలగొట్టినారని,అందులో ముగ్గిరి పరిస్థితి విషమం గా ఉందని అన్నారు.రాత్రి జరిగిన సంఘటన భయంకరమైన రాక్షస దాడిగా తెలుస్తున్నదనీ అన్నారు.దాడికి పాల్పడిన వారు అగ్రకులస్తులు కావడంతో,ఆర్ధిక భలం ఉండటంతో ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కావున ఎంతటివరైనా దాడికి పాల్పడిన వారిపై హత్య యత్నం,ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసుల తో పాటు నాన్ బేయిలబుల్ కేసులు పెట్టి,ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చట్ట పరమైన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించలని,ద్వాంసం అయినా చర్చ్ నీ తిరిగి నిర్మించాలని,చర్చ్ కి,క్రైస్తవులకు రక్షణ కల్పించాలని,ఇప్పటి వరకు ఏ నాయకులు ఖండించకపోవడం శోచనీయమని అన్నారు.ఇప్పటి కైనా నాయకులు స్పందించి మత సమరస్యతను కాపాడి.,మరో మణిపూర్ ల కాకముందే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు శాంతియుత నిరసన,ధర్నాకు పిలుపు నివ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో చిలుకూరు మండల ప్రెసిడెంట్ రమేష్,కోదాడ పట్టణ వైస్ ప్రెసిడెంట్ ప్రభుదాస్,పౌల్ చారి వినోద్,హరి గోన్స్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దాడిచేసినవారిపై హత్యాయత్నం,ఎస్సి,ఎస్టీ ఎట్రాసిటి కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి:కోదాడ నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్
RELATED ARTICLES



