హుజూర్ నగర్,ఫిబ్రవరి 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గరిడేపల్లి ఎస్సై,ఏఎస్సై లను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన పోనుగోడు అంబేద్కర్ యూత్ సభ్యులు.ఈ సందర్భంగా ఎస్సై సైదులు మాట్లాడుతూ యువత చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.యువత ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ పెంచుకొని లక్ష్యాలను చేరుకోవాలని యువతకు సందేశం ఇచ్చారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో పొనుగోడు గ్రామానికి చెందిన సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన నందిపాటి దీపిక ను పొనుగోడు గ్రామ అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు రేపు ట్రైనింగ్ కి వెళ్తున్న సందర్భంగా సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు నందిపాటి శ్రీను,కోశాధికారి చిలక సైదులు, గౌరవఅధ్యక్షులు నందిపాటి శ్రీను,నందిపాటి రామకృష్ణ,నరాల పవన్,రామ్,నాగేంద్రబాబు,నందిపాటి పృద్వి,నందిపాటి సన్నీ,నందిపాటి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.



