కోదాడ,ఫిబ్రవరి 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ఏసయ్య ఆధ్వర్యంలో ఉపవాస ప్రార్థన కూడికలు ఘనంగా జరుగుతున్నాయి.క్రైస్తవుల పవిత్ర పండుగలైన గుడ్ ఫ్రైడే ఈస్టర్ కు ముందుగా 40 రోజులు క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో దేశం బాగుండాలని మేము నివసిస్తున్న ప్రాంతం బాగుండాలని ప్రతి కుటుంబంలో ఆరోగ్యం శాంతి నెమ్మది నెలకొల్పబడాలని భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు మందిరాలలో కూడుకొని ప్రార్థనలు చేస్తారు.

ఇలా ప్రతిరోజు కూడుకొని ప్రార్థన చేయటం ద్వారా మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక అభివృద్ధి భక్తి జీవితం మెరుగుపడుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్దలు స్త్రీలు పిల్లలు యవనస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.



