కోదాడ,ఫిబ్రవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక తేజ పాఠశాల విద్యార్థులు, యూనిక్ అకాడమీ కోదాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో విజయ దుధింబిని మ్రోగించారు. డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్ విభాగంలో టి. ఉమామహేశ్వరి ప్రథమ బహుమతిని మరియు ప్రియదర్శిని ద్వితీయ బహుమతిని సాధించారు. జూనియర్ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఎం.నవీన్ ద్వితీయ బహుమతి, టి.ఉదయవర్ధనా చారి తృతీయ బహుమతిని సాధించారు. అలాగే అండర్-7 చెస్ విభాగంలో బి. సాయి కార్తికేయ ద్వితీయ బహుమతి,అండర్-11 విభాగంలో బి.సత్యానందన సాయి మరియు శామ్యూల్ చతుర్థి బహుమతి మిగతా విద్యార్థులు మెడల్స్ సాధించడం జరిగింది.పాఠశాలలో జరిగిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రతిభను కనపరచాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పారావు ,సెక్రటరీ సంతోష్ కుమార్,వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్,ఇన్చార్జులు రామ్మూర్తి,ఝాన్సీ,ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు,రమేష్,లావణ్య,మొదలగు వారు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



